తెలంగాణలో పేదరికం లేకుండా అంతం చేస్తా అంటున్న కెసీర్

తెలంగాణలో దళిత గిరిజనుల జీవితాలను వెలుగులు   నింపేందుకు ప్రత్యేక కమిటీలతో చర్యలు తీసుకుంటామని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలిపారు.

బండ్ల గణేష్ ఎక్కడ అంటున్న నెటీజన్స్

తే

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటానని మీడియాలో సవాల్ చేసి రెచ్చిపోయిన ఆ పార్టీ నేత బండ్ల గణేష్ ఎక్కడ అంటూ నేటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. తమ దగ్గర కత్తులు బ్లేడులు ఉన్నాయి అని గొంతు కోసుకోవడానికి సిద్ధమా అని బండ్ల గణేష్ ను నెటిజెన్స్ నిలదీస్తున్నారు. తనను ఇంటర్వి చేసిన ఛానల్ జర్నలిస్ట్ గణేష్ ఇంటికి స్వీట్ బాక్స్ బ్లేడుతో వెళ్లగా బండ్ల గణేష్ బయటకు రాలేదు అని సమాచారం

విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సర్కార్ మూవీ

తమిళ్ హీరో సూపర్ స్టార్  విజయ్ నటించిన సర్కార్ మూవీ నవంబర్ 7 న ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో రీలీజ్ అయ్యి

సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తుంది.

మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ఖరారు | Newstv-live.com

ఎలక్షన్ రన్ లో మహా కూటమి స్పీడు పెంచింది. సీట్లపై సూత్రప్రాయంగా ఓ అంచనాకు వచ్చాయి. సొంతంగా కూడా ప్రభుత్వ ఏర్పాటు చేసేలా మెజారిటీ సీట్లలో తామే పోటీ చేయాలన్నది మొదట్నుంచి కాంగ్రెస్ ప్లాన్. ఇందులో భాగంగా 90 నుంచి 95 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. మిగిలిన 25 సీట్లను భాగస్వామ్య పక్షాలకు వదులుకోవాలని నిర్ణయించింది. అయితే..ఏయే పార్టీ ఏయే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే అంశంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. పొత్తు లక్ష్యం నీరుగారి పోకుండా త్యాగాలకు కూడా సిద్ధమని భాగస్వామ్య పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. కాంగ్రెస్, టీడీపీ అధినాయకత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అటు సీపీఐ, టీజేఎస్ కూడా సీట్ల పంపకాలు ముఖ్యం కాదని, ఆయితే గౌరవప్రదంగా కేటాయింపులు ఉండాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సూత్రప్రాయ నిర్ణయాలు ఈ రెండు పార్టీల గౌరవాన్ని తూగుతాయా లేదా అన్నది ఆసక్తిగా మారింది. తమను నాలుగు సీట్ల వరకే పరిమితం చేయాలనే కాంగ్రెస్ తీరుపై అసంతృప్తిగానే ఉంది. కనీసం ఆరు సీట్లిస్తే..హుస్నాబాద్‌, బెల్లంపల్లి, మునుగోడు, ఆలేరు, కొత్తగూడెం, వైరా దేవరకొండలో బరిలోకి దిగాలని భావిస్తోంది.
భాగస్వామ్య పక్షాలకు కేటాయించే 25 సీట్లలో 15 స్థానాలను టీడీపీకి ఖారారు చేసింది కాంగ్రెస్. సీపీఐ, టీజేఎస్ నుంచి వచ్చే స్పందనను బట్టి ఒకటి రెండు సీట్ల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కూటమి ఏర్పాటు నుంచి భాగస్వామ్య పక్షాలు చీలిపోకుండా జాగ్రత్త పడుతున్న టీడీపీ అవసరమైతే సీట్ల త్యాగాలకు కూడా మానసికంగా సంసిద్ధమైంది. అన్ని అనుకూలిస్తే కూటమి పక్షాలన్ని రెండు మూడ్రోజుల్లో ఒకే వేదిక నుంచి 60 మందితో తొలి జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి.
నియోజకవర్గాల ఎంపికలో పట్టుదలకు పోతే కూటమి లక్ష్యం నెరవేరదన్నది నాలుగు పార్టీ భావన. బలమున్న నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని కాంగ్రెస్ మిత్ర పార్టీలకు సూచిస్తోంది. ఇదే సమయంలో గురువారం టీజేఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం కీలకంగా మారింది. ఈ సమావేశంలో పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్య…ఎంపిక చేసుకోవాల్సిన నియోజకవర్గాలపై చర్చించనున్నారు టీజేఎస్ నేతలు. కూటమి లెక్కల ముడి విప్పే ప్రయత్నాలు చేస్తూనే..అటు ప్రచారంలో గుట్టు చప్పుడు కాకుండా స్పీడు పెంచుతున్నాయి పార్టీలు. నవంబర్ 11న నోటిఫికేషన్ ఉండటంతో ఆలస్యంగానే అభ్యర్ధులను ప్రకటించాలనే ఎన్నికల వ్యూహంతో ఉంది. అభ్యర్ధులను అధికారంగా ప్రకటించకున్నా..మౌఖిక ఆదేశాలతో ప్రచారం స్పీడు పెంచుతున్నారు ఆశావహులు. టీఆర్ఎస్ కు అంతుచిక్కకుండా ప్రత్యేక వ్యూహంతో అధికార పార్టీని దెబ్బకొట్టాలని చూస్తోంది. డిసెంబర్‌ 12న మహాకూటమి సర్కార్‌ కొలువుదీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కూటమి పార్టీ నేతలు.