భారత్‌పై ఆదివారం బంగ్లాదేశ్ చారిత్రక టీ20 విజయాన్ని అందుకుంది. టీమిండియా చేతిలో వరుసగా 8 టీ20ల్లో ఓడిన బంగ్లాదేశ్.. ఎట్టకేలకి గెలుపు రుచి చూసింది. రెండు సార్లు ముష్ఫికర్‌ని ఔట్ చేసే అవకాశాన్ని భారత్ చేజార్చుకోగా.. 19వ ఓవర్‌లో ఖలీల్ వరుస బౌండరీలు సమర్పించుకున్నాడు.

హైలైట్స్

  • టీ20ల్లో భారత్‌పై బంగ్లాదేశ్ గెలుపొందడం ఇదే తొలిసారి
  • 19వ ఓవర్‌లో వరుసగా 4 ఫోర్లు ఇచ్చేసిన ఖలీల్.. మ్యాచ్‌లో మలుపు
  • కెప్టెన్‌గానూ కొన్ని నిర్ణయాల్లో విఫలమైన రోహిత్ శర్మ
  • ఆఖరి వరకూ పోరాడి బంగ్లాదేశ్‌ని గెలిపించిన ముష్ఫికర్

బంగ్లాదేశ్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. ముష్ఫికర్ రహీమ్ (60 నాటౌట్: 43 బంతుల్లో 8×4, 1×6) అజేయ అర్ధశతకం బాదడంతో భారత్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. టీ20 చరిత్రలో టీమిండియాపై బంగ్లాదేశ్ గెలుపొందడం ఇదే తొలిసారి. తాజా గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యం సాధించగా.. రెండో టీ20 మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా గురువారం రాత్రి 7 గంటలకి జరగనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *