ఫ్లిప్ కార్ట్ లో మరో సారి బిగ్ దీపావళి సేల్ జరగనుంది. అక్టోబర్ 21 నుంచి 25 వరకు జరగనున్న ఈ సేల్ లో వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఈ పండగ సీజన్ లో ఇదే ఆఖరి సేల్ అని కూడా ఫ్లిప్ కార్ట్ తెలిపింది

గత నెల రోజుల్లో రెండు సార్లు బిగ్ దీపావళి సేల్ ను నిర్వహించిన ఫ్లిప్ కార్ట్ మళ్లీ మూడోసారి కూడా దీపావళి సేల్ ను నిర్వహించడానికి సిద్ధం అయింది. ఈ సేల్ అక్టోబర్ 21 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు జరగనుంది. ఇందులో రెడ్ మీ నోట్ 7 ప్రో, రెడ్ మీ నోట్ 7ఎస్, రియల్ మీ 5, వివో జెడ్1 ప్రో సహా వివిధ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లను అందించనుంది. వివిధ స్మార్ట్ టీవీ మోడళ్లు, గృహోపకరణాలపై ఈ సేల్ లో 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అంతే కాకుండా వివిధ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, డీఎస్ఎల్ఆర్ లు, కెమెరాలపై కూడా ఆఫర్లు అందించనున్నారు.

ఈ సేల్ లో లభించే ఆఫర్ల గురించి వివరించడానికి ఫ్లిప్ కార్ట్ ఒక మైక్రోసైట్ ను కూడా అందించింది. అమెజాన్ తన ప్రైమ్ వినియోగదారులకు అందించినట్లే.. ఫ్లిప్ కార్ట్ కూడా తన ప్లస్ వినియోగదారులకు నాలుగు గంటల ముందే ఈ సేల్ ను ప్రారంభించనుంది. అంటే ఫ్లిప్ కార్ట్ ప్లస్ వినియోగదారులకు ఈ సేల్ రేపు(ఆదివారం) రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై అందించే ప్రధాన ఆఫర్లు ఇవే..
ఈ బిగ్ దీవాలీ సేల్ లో భాగంగా రూ.13,999 విలువైన రెడ్ మీ నోట్ 7 ప్రోను రూ.11,999కే అందించనున్నారు. అలాగే రూ.10,999 విలువైన రెడ్ మీ నోట్ 7ఎస్ ధర రూ.8,999కి తగ్గించారు. రియల్ మీ 5 మీద కూడా రూ.1,000 కూడా తగ్గింపు లభించనుంది. వీటితో పాటు రూ.14,990 విలువైన వివో జెడ్1 ప్రో ధర రూ.12,990కి దిగి వచ్చింది.

48 మెగా పిక్సెల్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. ధర మాత్రం బడ్జెట్ లోనే!

ఈ డిస్కౌంట్ ఆఫర్లే కాకుండా ఫ్లిప్ కార్ట్ లో లభించే వివిధ స్మార్ట్ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ చేంజ్ ఆఫర్లు లభించనున్నాయి. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ లో అందించే కొన్ని ఫోన్లపై పూర్తి మొబైల్ ప్రొటెక్షన్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

మరి ఇతర ఉత్పత్తులపై..
ఈ సేల్ లో 50 వేలకు పైగా ఉత్పత్తులపై 75 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్ కార్ట్ మైక్రోసైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం 32 అంగుళాల శాంసంగ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీపై కూడా తగ్గింపు ధరలను అందించనున్నారు. అంతేకాకుండా వివిధ గృహోపకరణాలపై కూడా తగ్గింపు ధరలను అందిస్తున్నారు. వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 90 శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 3పై కూడా డిస్కౌంట్ ఉండబోతున్నట్లు ఫ్లిప్ కార్ట్ మైక్రోసైట్ ద్వారా తెలుస్తోంది. వీటితో పాటు ఫ్లిప్ కార్ట్ బ్రాండ్లపై 85 శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.

Samsung ఆఫర్ సేల్ ప్రారంభం.. కళ్లు చెదిరే తగ్గింపు ధరలు!

మొబైల్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అదనపు డిస్కౌంట్లతో ధమాకా డీల్స్ అందించనున్నారు. సేల్ జరిగే రోజుల్లో ప్రతి రోజు అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఈ ధమాకా సేల్ జరుగుతుంది. వీటితో రష్ అవర్, మహా ప్రైస్ డ్రాప్ వంటి ఫ్లిప్ కార్ట్ అందించే సంప్రదాయ సేల్స్ ఎలాగో అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ కోసం ఫ్లిప్ కార్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేసే వారికి పది శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *