నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎంత మంచి వాడవురా’ చిత్రంను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మరియు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ చిత్రాలు రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇక వెంకీ మామను కూడా సంక్రాంతికే తీసుకు రావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎంత మంచి వాడవురా కూడా సంక్రాంతికి వస్తే పోటీ ఎలా ఉంటుందా అనే చర్చ మొదలైంది.

కళ్యాణ్ రామ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈయన సక్సెస్ దక్కించుకుని చాలా కాలమైన కారణంగా సినిమాకు అంత బజ్ క్రియేట్ అవ్వడం లేదు. దర్శకుడు సతీష్ వేగేష్న మొదటి సినిమా శతమానం భవతి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా తర్వాత సినిమా ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను కనెక్ట్ అయ్యేలా శతమానం తరహాలో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడని అంటున్నారు.

సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సంక్రాంతి పోటీని తట్టుకోగలుగుతుందా అంటే అనుమనామే అంటున్నారు. 2017 సంక్రాంతికి ఖైదీ నెం.150.. గౌతమి పుత్ర శాతకర్ణి మరియు శతమానం భవతి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మూడు సినిమాలు కూడా కొద్ది రోజుల తేడాతో వచ్చి ప్రేక్షకులను అలరించాయి. మూడు సినిమాలకు కూడా హిట్ టాక్ వచ్చిన కారణంగా మూడు సినిమాలు కూడా మంచి వసూళ్లు నమోదు చేశాయి. అలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.

సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురంలో చిత్రంకు పోటీగా నిలవాలంటే ఎంత మంచివాడవురా చిత్రం శతమానం భవతి చిత్రాన్ని మించి విజయాన్ని సొంతం చేసుకోవాలి. అలా అయితేనే పోటీని తట్టుకోగలదు. మరి సతీష్ వేగేశ్న శతమానంను మించి ఈ చిత్రాన్ని చేశాడా అనేది చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *