దక్షిణాఫ్రికాపై రాంచీలోనూ రోహిత్ శర్మ శతకం

హైలైట్స్

  • రాంచీ టెస్టులోనూ శతకం బాదేసిన ఓపెనర్ రోహిత్ శర్మ
  • 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్పిన్నర్ బౌలింగ్‌లో భారీ సిక్స్
  • రోహిత్‌కి టెస్టు కెరీర్‌లో ఇది ఆరో శతకం.. ఈ సిరీస్‌లో మూడోది
  • అజింక్య రహానె‌తో కలిసి భారీ భాగస్వామ్యం నమోదు

దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా శనివారం ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. తొలి సెషన్‌లో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్ శర్మ.. రెండో సెషన్‌లో మాత్రం గేర్ మార్చి కేవలం 130 బంతుల్లోనే 13×4, 4×6 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 95 వద్ద సఫారీ స్పిన్నర్ పైడిట్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్ బాది మరీ రోహిత్ శర్మ శతకం పూర్తి చేసుకోవడం అతని జోరుకి నిదర్శనం. టెస్టు కెరీర్‌లో రోహిత్ శర్మకి ఇది ఆరో శతకంకాగా.. ఇటీవల విశాఖపట్నం వేదికగా ముగిసిన తొలి టెస్టు.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఈ ఓపెనర్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *