రామ్‌చరణ్‌ కొత్త చిత్రం..ఫస్ట్‌లుక్‌ రేపే | newstv-live.com

Movies
403
0
sample-ad

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. ‘స్టేట్‌ రౌడీ’, ‘వినయ విధేయ రామ’ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రవర్గాలు ట్విటర్ ద్వారా వెల్లడించాయి. రేపు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అడ్వాణీ నటించారు. ఇటీవల సినిమా చిత్రీకరణ పూర్తయింది. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో నటించనున్నారు.

మీ నాన్న లక్షణాలు నీలోనూ ఉన్నాయి..
చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా వివేక్‌ ఒబెరాయ్‌.. రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘కెమెరా ఆన్‌ అయితే శత్రువులం. కెమెరా ఆఫ్‌ అయితే సోదరులం. ఈ చిత్రంలో నటించడం ఓ గొప్ప అనుభూతి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. నా బ్రదర్‌ రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. నన్ను ఇంత బాగా ఆదరించినందుకు ధన్యవాదాలు. మీ నాన్నలో ఉన్న గొప్ప లక్షణాలన్నీ నీలోనూ ఉన్నాయి.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

రామ్‌చరణ్‌ కొత్త చిత్రం..ఫస్ట్‌లుక్‌ రేపే!
sample-ad

Facebook Comments

POST A COMMENT.