బాలిక జడ కత్తిరింపుపై విచారణ | newstv-live.com

Kadapa
339
0
sample-ad

అట్లూరు కస్తూరిబా విద్యాలయంలో ఒక విద్యార్థిని జడ కత్తిరింపుపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ విద్యాలయంలో 200 మంది బాలికలు చదువుకుంటున్నారు. కస్తూరిబాలో చదువుతున్న ఒక విద్యార్థిని గురువారం రాత్రి నిద్రిస్తుండగా ఎవరో జడను కత్తించారు. శుక్రవారం తెల్లవారేసరికి జుట్టు లేకపోవడంతో బాలిక తీవ్రస్థాయిలో రోదించారు. కస్తూరిబాలో చోటుచేసుకున్న ఘటనపై ప్రత్యేకాధికారి అరుణ ఫిర్యాదుతో జీసీడీవో మేరీ విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యార్థినులంతా కలసికట్టుగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. విద్యార్థిని తల్లికి విషయం తెలియటంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. గతంలోను బాలికలకు తేళ్లు కరవడం, పప్పులో బాలిక కాలు పెట్టడం తదితర ఘటనలు చేసుకున్నాయని, అన్నింటా ఉపాధ్యాయులు బాలికలపై నిర్లక్ష్యం చూపుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈవిషయంపై ప్రత్యేకాధికారిణి అరుణ వివరణ కోరగా జడను కత్తించిన బాలికను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తేలుకుట్టి మూడురోజులైనా చెప్పలేదు.. : మాకూతురు నిద్రిస్తుండగా జుట్టు కత్తించారు. దీంతో మా అమ్మాయి మనోవేదనకు గురవుతోంది. ఒకరోజంతా చెప్పకుండా కప్పిపెట్టారు. గతంలోనూ తేలు  కుడితేఊ మూడురోజుల వరకు చెప్పకుండా మభ్యపెట్టారు. ఇప్పుడున్న ఉపాధ్యాయులు, ప్రత్యేకాధికారి బాలికల ప్రాణాలు పోయినా స్పందించేటట్లు లేరు. కస్తూరిబాలో భద్రత కరవైంది.

 

 

sample-ad

Facebook Comments

POST A COMMENT.