కడప ప్రజలు మంచోళ్లు అని అబివర్నించిన : వెంకటరత్నం | newstv-live.com

Kadapa
152
0
sample-ad

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: కడపకు బదిలీపైన వస్తున్నప్పుడు అందరు కడపకు ఎందుకు వెళ్తున్నావని భయపెట్టారు. ఇక్కడకు వచ్చాక తెలిసింది విన్నది, సినిమాల్లో చూపేరీతిలో ఇక్కడ లేదని.. కడప జిల్లా వాసులు చాలా మంచోళ్లు అని బదిలీపై వెళ్తున్న సీఈఓ వెంకటరత్నం నాయుడు అన్నారు. డీసీసీబీ సీఈఓగా పనిచేసి బదిలీపైన ఆప్కాబ్‌కు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనకు బ్యాంకు సమావేశ మందిరంలో వీడ్కోలు పలుకుతు కొత్త సీఈఓ రఘునాథరెడ్డికి ఆహ్వానం పలుకుతు సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌రెడ్డి ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడారు. అప్పు వసూలు బాగా చేశామన్నారు. అంతకు ముందు ఛైర్మన్‌ మాట్లాడుతూ.. బ్యాంకు అభివృద్ధికి ఆయన కృషి చేశారన్నారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

sample-ad

Facebook Comments

POST A COMMENT.