Featured

బిగ్ బాస్ ఫైనల్ లో రియల్ బిగ్ బాస్

మెగాస్టార్బి చిరంజీవి గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు . బాస్ సీజన్ 3 విజేత ఎవరన్న ఉత్కంఠకు తెరపడినట్టే. సీజన్ మొత్తం టైటిల్ ఫేవరేట్‌గా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీముఖి వెనక్కినెట్టి విన్నర్‌గా అవతరించాడు రాహుల్. 105 రోజుల బిగ్ బాస్ ఆటకు నేటి రాత్రితో తెరపడనుంది. నాగార్జున హోస్ట్‌గా 17 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ సీజన్ 3‌లో ఆదివారం నాడు విజేతను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఫైనల్‌లో రాహుల్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీలు ఉండగా.. శ్రీముఖి, రాహుల్‌ల మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే అనూహ్యంగా చివర్లో శ్రీముఖికి గట్టి షాక్ ఇచ్చి.. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్ అవతరించినట్టు తెలుస్తోంది. నేటి రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ షూట్ పూర్తి కావడంతో విన్నర్ ఎవరన్న లీక్ బయటకు వచ్చేసింది. శ్రీముఖి రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకోగా రాహుల్‌ని విజేతగా ప్రకటించనున్నట్టు సమాచారం. యాంకర్ శ్రీముఖి తొలి నుండి టాస్క్‌లతో పాటు పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకుంటూ టైటిల్ రేస్‌లో తానే నంబర్‌గా నిలుస్తోంది. ఇక ఆమెకు బయట కూడా అభిమానగనం ఘనంగా ఉండటంతో ఆమెదే టైటిల్ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.

శ్రీముఖితో వైరం.. పాతబస్తీ పోరడు.. ఎక్కువ సార్లు నామినేట్ అయిన కంటెస్టెంట్‌గా ఆడియన్స్‌లో సింపథీ గెయిన్ చేసుకున్నారు రాహుల్. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 14 వారాల్లో (15 వారంలో నామినేషన్స్ లేవు) 11 సార్లు నామినేషన్‌లోకి వెళ్లి.. ఈ సీజన్‌లో ఎక్కువ సార్లు నామినేట్ అయ్యి సేవ్ అయిన కంటెస్టెంట్‌ అయ్యాడు. టాస్క్‌లు ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల కెప్టెన్ కూడా కాలేకపోయాడు రాహుల్. అయితే విన్నర్ కావడానికి ఇవేమీ అవసరం లేదని రుజువుచేశాడు రాహుల్. తన నేటివిటీని ఒరిజినాలిటీని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ తను బార్బర్ అనే విషయాన్ని ప్రమోట్ చేసుకుని సెంటిమెంట్ వర్కౌట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్. బిగ్ బాస్ విన్నర్ అయితే వచ్చిన రూ. 50 లక్షలతో ఏం చేస్తావ్ అంటే.. ఓ బార్బర్ షాప్ పెడతా.. నా కుల వృత్తిని నేను వదులు కోను. అది చేయడానికి గర్వపడతా అంటూ రాహుల్ చెప్పిన మాటలు ఆ వర్గం వారికి బాగా కనెక్ట్ అయ్యింది.దీంతో పాటు శ్రీముఖిని విజేతను చేసేందుకు బిగ్ బాస్ వాళ్లతో కుమ్మక్కు అయ్యారనే విషయం జనంలోకి బాగా వెళ్లిపోవడంతో రాహుల్‌కి బాగా కలిసి వచ్చింది. వాళ్లు విజేతను ప్రకటించడం ఏంటి? ఓట్లు వేయాల్సింది మేం కదా.. అని ఆడియన్స్ గంపగుత్తగా ఓట్లు రాహుల్‌కి గుద్దేశారు. ఇంకా బాబా భాస్కర్, వరుణ్, అలీలు ఉన్నారు కదా.. వాళ్లకు ఎందుకు ఓట్లు పడలేదు అంటే.. రాహుల్‌కి శ్రీముఖితో ఉన్న వైరం అతనికి వరంలా మారింది. 11 వారాలు వరుస నామినేషన్స్‌తో పడుతూ లేస్తూ వస్తున్న రాహుల్‌కే జనం జై కొట్టారఇదిలా ఉంటే తెలుగు సమయం నిర్వహించిన పోల్‌లోనూ శ్రీముఖి కంటే రాహుల్‌కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. నిన్నటి వరకూ ఈ ఇద్దరికీ టై కాగా.. చివరి రోజున రాహుల్ పుంజుకుని కేవలం ఒక్క శాతం ఓట్లుతో ముందంజలో ఉన్నారు. రాహుల్ సిప్లిజంగ్ 32 శాతం ఓట్లు సాధించి తొలి స్థానంలో ఉండగా.. శ్రీముఖి 31 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక బాబా భాస్కర్ 19 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉండగా.. వరుణ్ సందేశ్ నాలుగో స్థానంలో ఉన్నారు. అలీ రెజా 4 శాతం ఓట్లతో చివరి స్థానంతో సరిపెట్టుకున్నారు.

Featured

ఘోరంగా ఓడిపోయినా టీం ఇండియా ……..

భారత్‌పై ఆదివారం బంగ్లాదేశ్ చారిత్రక టీ20 విజయాన్ని అందుకుంది. టీమిండియా చేతిలో వరుసగా 8 టీ20ల్లో ఓడిన బంగ్లాదేశ్.. ఎట్టకేలకి గెలుపు రుచి చూసింది. రెండు సార్లు ముష్ఫికర్‌ని ఔట్ చేసే అవకాశాన్ని భారత్ చేజార్చుకోగా.. 19వ ఓవర్‌లో ఖలీల్ వరుస బౌండరీలు సమర్పించుకున్నాడు.

హైలైట్స్

  • టీ20ల్లో భారత్‌పై బంగ్లాదేశ్ గెలుపొందడం ఇదే తొలిసారి
  • 19వ ఓవర్‌లో వరుసగా 4 ఫోర్లు ఇచ్చేసిన ఖలీల్.. మ్యాచ్‌లో మలుపు
  • కెప్టెన్‌గానూ కొన్ని నిర్ణయాల్లో విఫలమైన రోహిత్ శర్మ
  • ఆఖరి వరకూ పోరాడి బంగ్లాదేశ్‌ని గెలిపించిన ముష్ఫికర్

బంగ్లాదేశ్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. ముష్ఫికర్ రహీమ్ (60 నాటౌట్: 43 బంతుల్లో 8×4, 1×6) అజేయ అర్ధశతకం బాదడంతో భారత్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. టీ20 చరిత్రలో టీమిండియాపై బంగ్లాదేశ్ గెలుపొందడం ఇదే తొలిసారి. తాజా గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యం సాధించగా.. రెండో టీ20 మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా గురువారం రాత్రి 7 గంటలకి జరగనుంది.

Featured

ఖైదీ సినిమా రివ్యూ

విమర్శకుల రేటింగ్ : 3.5 /5
వీక్షకుల రేటింగ్ : 3.5 /5
విమర్శకుల రివ్యూ


తమిళ హీరో కార్తి ప్రతి సినిమాకు వైవిధ్యం చూపిస్తూ ఉంటారు. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంటారు. ఈ కోవలోనే తాజాగా ‘ఖైదీ’ సినిమా చేశారు. ‘నగరం’ వంటి థ్రిల్లర్ మూవీని తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ
ఆది శంకర్ (హరీష్ ఉత్తమన్) అనే గ్యాంగ్‌స్టర్ తెలుగు రాష్ట్రాల్లోకి అక్రమంగా కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను తీసుకొస్తాడు. చిత్తూరు నుంచి ఆ డ్రగ్స్‌ను మిగిలి ప్రొంతాలకు తరలించాలని ప్లాన్ చేస్తాడు. అయితే, కొంత మంది పోలీసులు ఆ గ్యాంగ్‌లో అండర్ కవర్ ఆఫీసర్లుగా ఉండటంతో ఆ సరుకు మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఎస్పీ ఆఫీసులో దాచిపెడతారు.

ఆ డ్రగ్స్‌ను ఎలాగైనా చేజిక్కుంచుకోవాలని, ఇన్ఫార్మర్లుగా ఉన్న పోలీసులను చంపేయాలని ఆది శంకర్ గ్యాంగ్ ప్లాన్ వేస్తుంది. ఇదే సమయంలో జైలు నుంచి విడుదలైన ఢిల్లీ (కార్తి) అనుకోకుండా పోలీసుల దగ్గర ఇరుక్కుంటాడు. అయితే, ఆ పోలీసులకు ఢిల్లీనే దిక్కవుతాడు. ఖైదీ జీవితాన్ని అనుభవించి బయటికి వచ్చిన ఢిల్లీ.. అసలు పోలీసులకు ఎందుకు సాయం చేశాడు? గ్యాంగ్‌స్టర్స్ నుంచి వాళ్లను ఎలా కాపాడాడు అనేదే సినిమా.

రివ్యూ
సాధారణంగా సినిమా అంటే హీరోహీరోయిన్, విలన్, పాటలు, ఫైట్లు, ఎమోషన్స్. ఒక సగటు ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ అంశాలు ఇవే. కానీ, కొన్ని సినిమాలు వీటన్నిటికీ విరుద్ధం. హీరోయిన్ ఉండదు, పాటలు ఉండవు.. కేవలం స్క్రీన్‌ప్లే మీదే నడుస్తాయి. అలాంటి చిత్రమే ‘ఖైదీ’. ఒక్క రాత్రిలో ఏం జరిగింది అనేదే ఈ సినిమా. అంతా చీకటిలోనే ఉంటుంది. కానీ, చాలా ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనం పరిగెడుతూనే ఉంటుంది.

‘నగరం’ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు లోకేష్.. ‘ఖైదీ’తో తానెంటో మరోసారి నిరూపించుకున్నారు. కథనం అంత బాగా రాసుకున్నారు. కేవలం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కథనాన్ని నడిపించారు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం ఛేజింగ్‌లు, ఫైట్లు, ఎమోషన్స్‌తోనే రెండున్నర గంటల పాటు సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. కానీ, లోకేష్ నడిపించారు. కార్తి లాంటి నటుడుని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు.

యావజ్జీవ శిక్ష పడిన ఒక ఖైదీ సత్ప్రవర్తనతో బయటికి వచ్చి.. ఎలా ఉంటుందో తెలియని కూతురు కోసం తపన పడుతూ ఉంటాడు. అలాంటి తండ్రి పాత్రలో కార్తి నటన చాలా బాగుంది. మొరటోడిగా, గ్యాంగ్‌స్టర్స్‌ను మట్టుబెట్టే మొనగాడిగా కార్తి కరెక్ట్‌గా సరిపోయారు. కొన్ని సన్నివేశాల్లో కార్తి ఏడిపించేశారు కూడా. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కూతురి చూసినప్పుడు కార్తి నటన ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా కార్తి వన్ మ్యాన్ షో. ఇక, టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్ బెజోయ్‌గా నటించిన నరైన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ మధ్యలో ధీన తన నటనతో నవ్వించాడు. వయసు మీద పడినా ఉద్యోగ ధర్మం కోసం దేనికైనా తెగించే కానిస్టేబుల్ పాత్రలో జార్జ్ నటన బాగుంది.

టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా సామ్ సీఎస్ నేపథ్య సంగీతం, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలు. ఈ సినిమాను మొత్తం 60 రాత్రుల్లో చిత్రీకరించారు. చీకటిలోనే అయినప్పటికీ లైటింగ్ ఎఫెక్ట్‌తో అద్భుతంగా తెరకెక్కించారు. రాత్రి పూట అడవిలో లారీలో ప్రయాణం చేసే సన్నివేశాలను సత్యన్ సూర్యన్ తన కెమెరాలో అద్భుతంగా బంధించారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి ఒక కొత్త ఫీలింగ్ కలుగుతుంది.

మొత్తంగా చూసుకుంటే ఇదొక మంచి యాక్షన్ థ్రిల్లర్. ఫ్యామిలీ ఆడియన్స్‌ని పక్కన బెడితే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి విందు భోజనమే. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. దీనికి సినిమా క్లైమాక్స్‌లో చిన్న క్లూ ఇచ్చారు. అదేంటో మీరే సినిమా చూసి తెలుసుకోండి.


సమీక్ష
మా విమర్శకుడి రేటింగ్
దర్శకత్వం 3.5/5
మాటలు 3/5
కథ 3.5/5
సంగీతం 3.5/5
Featured

వార్ వన్ సైడే :మహారాష్ట్ర హర్యానా ఎన్నికలలో బీజేపీ కింగ్

Maharashtra Exit polls: వార్ వన్ సైడే.. బీజేపీ కూటమికే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు
బీజేపీ శ్రేణులకు నాలుగు రోజుల ముందే దీపావళి రానుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమికి మూడింట రెండొంతుల స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నామమాత్రపు స్థానాలతోనే సరిపెట్టుకుంటాయని తేలింది. మిగతా పార్టీలు అసలు ఏ మాత్రం ప్రభావం చూపలేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

బీజేపీ+243
కాంగ్రెస్ =48
ఇతరులు =4
మొత్తం అసెంబ్లీ సీట్స్ =288
Featured

మోడీకి టాలీవుడ్ డైరెక్టర్ సవాల్ ….

ప్రధాని మోదీకి లేఖ రాసిన పూరీ జగన్నాథ్.. కొన్ని సూచనలు చేస్తూ..

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై కొన్ని సూచనలను చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను పూరి తన సోషల్ మీడియా అకౌంట్ ట్వీటర్ వేదికగా షేర్ చేశారు. వివరాల్లోకి వెళితే..   ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నిత్యం వాడే కవర్లు లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే.. ఈ విషయంపై టాలీవుడ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ నేరుగా ప్రధాని మోదీకి లేఖ రాస్తూ.. కొన్ని సూచనలు ఆ లేఖలో పేర్కోన్నారు.

ప్రస్తుతం వాతావరణంలో విపరీతమైన మార్పులకు కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రమే కారణం కాదని, దీనితో పాటు అనేక ఇతర అంశాలు కూడా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నారు. కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని బ్యాన్ చేస్తే పర్యావరణంలో ఒక్కసారిగా మార్పు రాదని ఆయన తన లేఖలో అభిప్రాయపడ్డారు. అయితే ఒక్క సారిగా ఈ బ్యాన్ వల్ల ప్రజలందరూ ప్లాస్టిక్‌ను వదిలి పేపర్ బ్యాగులు వాడడం చేస్తారని దీని వల్ల పేపర్‌‌కు విపరీతమైన డిమాండ్ రావడంతో..  చెట్లను ఎక్కువగా నరికే పరిస్థితి వస్తుందన్నారు.

PURIJAGAN@purijagan

Dear Hon’ble Prime Minister Shri @narendramodi ji

IS SINGLE USE PLASTIC REALLY A PROBLEM?

View image on Twitter
View image on Twitter