VIDEO CHANNEL


OKA VIJETHA PARICHAYAM
INTERVIEW: PUTTA MADHU
BBC NEWS
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
Live Streaming



#Advt
.Tariff - // www.newstv-live.com
Now available up to 16% Discount

^ Top Banner (Beside main logo) - 1 month - Rs. 20,000
^ Scrolling - Up to 150 charactors (English) - 1 Month - Rs. 9,000
^ Spot (Video) - Up to 5 minutes - 1 month - Rs. 10,000
^ Display (Strip), left side - Image + web link - 1 month - Rs.10,000
^ LIVE Telecast - Up to 3 Hours -Rs. 20,000 +tax


for Details +91 - 8008 23 88 34





అత్యంత విజయవంతమైందని వ్యాఖ్య
ఇంత ఆకర్షణగల నేతను మళ్లీ చూడలేను
మోదీపై జాన్‌కెర్రీ ప్రశంసపూర్వక వ్యాఖ్యలు

ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ స్వదేశానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌తోపాటు మరికొందరు మంత్రులు, అధికారులు మోదీకి స్వాగతం పలికారు. తన అమెరికా పర్యటన అత్యంత విజయవంతంగా, సంతృప్తికరంగా జరిగిందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘థ్యాంక్యూ అమెరికా’ అంటూ అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం అమెరికా-భారత్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ఐబీసీ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చివరిగా మోదీ పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి ఆండ్రూస్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌కు వెళ్లి, ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో భారత్‌ బయలుదేరారు. భారత రాయబారి జైశంకర్‌, అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలు) నిషా దేశాయ్‌ బిశ్వాల్‌ తదితరులు మోదీకి వీడ్కోలు పలికారు. అంతకుముందు తన గౌరవార్థం అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్‌, విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ ఏర్పాటు చేసిన మధ్యాహ్న విందు కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు బిజీబిజీగా గడిపిన మోదీ... ఈ కార్యక్రమంలో మాత్రం కాస్త విశ్రాంతిగా కనిపించారు. సరదా సంభాషణలతో నేతల మధ్య నవ్వులు పూశాయి. ‘పత్రికల్లో, టీవీల్లో ఎక్కడ చూసినా మీ కవరేజీయే. మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో భారత-అమెరికన్ల నుంచి మీకు లభించిన ఆదరణను పోల్చలేము. ఇంతటి ఆకర్షణ ఉన్న నేతను మళ్లీ చూడలేను.’ అంటూ మోదీపై జాన్‌ కెర్రీ ప్రశంసపూర్వక వ్యాఖ్యలు చేశారు. విధాన, పారిశ్రామిక, చలనచిత్ర, సృజనాత్మక, నూతన ఆవిష్కరణల విషయంలో రెండు దేశాల మధ్య సారూప్యాలను కెర్రీ ప్రస్తావించారు. స్వామి వివేకానంద శతాబ్దం క్రితమే చెప్పినట్లు అణచివేతకు గురైన అన్ని కులాల, అన్ని మతాల నిర్వాసితులకు భారత్‌, అమెరికా ఆశ్రయం ఇస్తున్నాయని కెర్రీ చెప్పారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఈ రెండు దేశాలు మరింత సమన్వయంతో, విశ్వాసంతో ముందుకెళ్లాల్సి ఉందన్నారు. కేవలం అంగారక గ్రహంపైనే కాకుండా... భూమ్మీద కూడా కలిసి పయనించాల్సిన అవసరముందని మోదీ అన్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ విషయంలో నూరుశాతం విజయవంతం కాగలమన్న విశ్వాసం ఉందన్నారు. ‘అమెరికాలోని వ్యవస్థలు 120 వోల్ట్స్‌తో పనిచేస్తుంటే... భారత్‌లోని వ్యవస్థలు 220 వోల్ట్స్‌తో పనిచేస్తున్నాయి. వీటి మధ్య తేడాను తగ్గించి సామరస్యం పెరిగేలా చూడాల్సిన అవసరముంది’ అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రపంచ సంక్షేమం కోసం అమెరికాతో కలిసి పని చేయడానికి భారత్‌ సిద్ధమేనన్నారు. భారత్‌, అమెరికా సంబంధాలకు ఒబామా కొత్త రూపు ఇచ్చారని కూడా మోదీ చెప్పారు. ఈ కార్యక్రమం తర్వాత కేపిటల్‌ హిల్‌ (శ్వేతసౌధం)లో తన గౌరవార్థం అమెరికా ప్రతినిఽధుల సభ స్పీకర్‌ జాన్‌ బొయెనర్‌ఇచ్చినతేనీటి విందుకు మోదీ వెళ్లారు.
ఇందులో పదిమంది వరకూ ప్రతినిధుల సభ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ మార్పులు, ఉగ్రవాదంసహా పలు అంశాలపై మోదీ చర్చించారు. స్వప్రయోజనాల కోసం ఏ ఒక్క దేశమూ పర్యావరణానికి హాని కలిగించేలా వ్యవహరించే వీల్లేదని మోదీ పేర్కొన్నారు. భారత్‌, అమెరికాలు సంయుక్తంగా ప్రపంచ దేశాలకు ఈ సందేశాన్ని విస్తరిస్తే... పర్యావరణాన్ని, ప్రకృతి సంపదను కాపాడుకోగలుగుతామని చెప్పారు.
NTV NEWS LIVE
PRIYANKA CHOPRA
Times Now
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
VIDEO CHANNEL